మా గురించి
తూర్పు జయప్రకాష్ రెడ్డి
(అలియాస్ జగ్గారెడ్డి)
తండ్రి : తూర్పు జగ్గారెడ్డి (రెడ్డి సామాజికవర్గం)
తల్లి : జమ్మయమ్మ ( మాదిగ సామాజికవర్గం )
భార్య : నిర్మల జగ్గారెడ్డి ( గౌడ్ సామాజికవర్గం )
మాది ప్రేమ వివాహం
కుమార్తె : తూర్పు జయరెడ్డి
కుమారుడు: తూర్పు భారత్ రెడ్డి..
రాజకీయ తొలి అడుగులు ఆరెస్సెస్ నుండి ప్రారంభం..తర్వాత ఏబీవీబీ ,బీజేవైఎం లో పని చేశాను బీజేపీ నుండే మున్సిపల్ చైర్మన్ గా గెలిచను.. కానీ బీజేపీ లో నన్ను రాజకీయంగా అనుగదొక్కే ప్రయతం జరిగింది .దింతో టీఆరెస్ లోకి వెళ్లాను.. 2004 లో అలయన్స్ లో భాగంగా టీఆరెస్ నుండి పోటీ చేశాను గెలిచను అనంతరం కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళాను ,అప్పటికే కాంగ్రెస్ నుండి నాకు పిలుపు వచ్చింది..కానీ టీఆరెస్ లో నాకు రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి లేకుండ ,అనుగదొక్కే ప్రయత్నం కూడా జరుగలేదు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మరాల్సి వచ్చింది.. అనంతరం 2009 లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలిచాను.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి .. అదే సంవత్సరం మెదక్ పార్లిమెంట్ కోసం వచ్చిన ఉఓ ఎన్నికలో బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది.. ఐతే ఒక సన్నిహితుడి ఒత్తిడి మేరకే తప్పని పరిస్థితుల్లో బీజేపీ కి వెళ్ళాల్సివచ్చింది..వెళ్లే ముందు ఇది తప్పుడు నిర్ణయం అని తెలిసిన సన్నిహితుడి మాట కోసం పోటీ చేయాల్సి వచ్చింది.. ఇక అక్కడ ఇమడలేక తప్పుడు నిర్ణయం అని ముందే అనుకున్నాను కనుకే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కి క్షమాపణ లు చెప్పి ఉత్తమ్ ఆధ్వర్యంలో పార్టీ లో చేరాను.. 2018 లో మరోసారి కాంగ్రెస్ నుండి పోటీ చేసి టీఆరెస్ అభ్యర్థి పై గెలవడం జరిగింది.. ఇక దుర్గ భవాని అనే అమ్మాయి గురించి ఒక ప్రముఖ ఛానల్ లో స్టోరీ వచ్చింది.అది చూసి మానవతా దృక్పధం తో ఆమెను దత్తతు తీసుకున్న..ఆ పాపను ఉన్నతస్థాయి చదువులు చదివించి ,ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసేవరకు నాదే బాధ్యత..
Our story
2004 లో అలయన్స్ లో భాగంగా టీఆరెస్ నుండి పోటీ చేశాను గెలిచను అనంతరం కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళాను ,అప్పటికే కాంగ్రెస్ నుండి నాకు పిలుపు వచ్చింది.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మరాల్సి వచ్చింది..